'సంజూ' బాబా టీజర్‌ అదిరింది.!

మరిన్ని వార్తలు

సంజయ్‌దత్‌ అంటే బాలీవుడ్‌లో స్టార్‌ హీరో. కానీ టాలీవుడ్‌కి మాత్రం 'మున్నాభాయ్‌' సిరీస్‌తో పరిచయం. ఎందుకంటే ఆ సిరీస్‌ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేశాడు. ఆ కారణంగా సంజయ్‌దత్‌ని టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా గుర్తుంచుకుంటారు.అయితే ఇప్పుడీ మున్నాభాయ్‌ టాపిక్‌ ఎందుకొచ్చిందంటే, బాలీవుడ్‌లో 'సంజూ' టైటిల్‌తో సంజయ్‌దత్‌ బయోపిక్‌ తెరకెక్కుతోంది. 

రణ్‌వీర్‌ కపూర్‌, సంజయ్‌దత్‌ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్‌కుమార్‌ హిరానీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతవరకూ చాలా బయోపిక్స్‌ వచ్చాయి. కానీ సంజయ్‌దత్‌ బయోపిక్‌ చాలా ప్రత్యేకం. సంజయ్‌దత్‌ కెరీర్‌లో చాలా యాంగిల్స్‌ ఉన్నాయి. కుర్రాడిగా ఉన్నప్పుడు డ్రగ్ప్‌ బారిన పడ్డాడు. అందులో నుండి బయట పడ్డాక తనని తాను మార్చుకోవాలనుకున్నాడు. మారాడు కూడా. హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. తర్వాత రాజకీయ నాయకుడిగానూ అవతారమెత్తాడు. 

అలా సినీ నటుడిగానే కాకుండా, రాజకీయనాయకుడుగా కూడా తన సత్తా చాటాడు. ఇవే కాదు, సంజయ్‌దత్‌లో ఇంకా చాలా యాంగిల్స్‌ ఉన్నాయి. బహుశా సినీ రంగంలో ఏ వ్యక్తికీ ఇన్ని కోణాలు ఉండవేమో. అందుకే సంజయ్‌దత్‌ బయోపిక్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ముంబయ్‌ పేలుళ్లు.. ఆ కేసుకు సంబంధించి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనీ, 'టాడా' కేసులో అరెస్టయ్యి జైలు శిక్ష అనుభవించాడు. కొన్నాళ్లు బెయిల్‌పై వచ్చాడు. సినిమాలు చేశాడు. మళ్లీ జైలుకెళ్లాడు అదే కేసులో. 

సంజయ్‌దత్‌ జీవితంలో డ్రగ్స్‌ అండ్‌ ఎంజాయ్‌మెంట్‌, సినిమా, జైలు, రాజకీయాలు ఇవన్నీ ఈ సినిమాలో పొందుపరిచారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌ విశేషంగా ఎట్రాక్ట్‌ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS