సంక్రాంతి సీజ‌నే శ్రీ‌రామ ర‌క్ష‌

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతి సీజ‌న్‌లో నాలుగు సినిమ‌లొచ్చాయి. అయితే అంద‌రి దృష్టీ... 'గుంటూరు కారం'పైనే ఉండేది. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయమ‌ని అంతా న‌మ్మారు. ఎందుకంటే మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబోలో ఉన్న మ్యాజిక్ అది. సినిమా ఏమాత్రం బాగున్నా రికార్డు వ‌సూళ్లు ఖాయం అన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల భ‌రోసా. అయితే ఆ క‌ల‌ల‌న్నీ ప్రీమియ‌ర్ షోల‌తోనే ఎగిరిపోయాయి. అర్థ‌రాత్రి 1 గంట‌కు 'గుంటూరు కారం' ప్రీమియ‌ర్లు ప‌డ్డాయి. అన్నిచోట్లా నుంచి నెగిటీవ్ రిపోర్టే. మ‌హేష్ అభిమానులు సైతం ఈ సినిమా చూసి విస్తుపోయారు. గురూజీ ఏంటి ఇలా తీశాడంటూ త్రివిక్ర‌మ్ పై నిష్టూరాలు ఆడారు.


అయితే ఈ టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు వ‌చ్చాయి. రెండో రోజు కాస్త డ‌ల్ అయినా, మూడో రోజు వ‌సూళ్లు, రెండో రోజు కంటే ఎక్కువ క‌నిపించాయి. సోమ‌వారం కూడా ఇదే స్థాయిలో క‌ల‌క్ష‌న్లు రావొచ్చు. మామూలుగా అయితే ఇంత నెగిటీవ్ టాక్ వ‌స్తే ఎంత పెద్ద హీరో ఉన్నా ఏం చేయ‌లేడు. రెండో రోజే దుకాణం స‌ర్దేయాలి. కానీ గుంటూరు కారం విష‌యంలో అదృష్టం నిర్మాత ప‌క్షంలో ఉంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా, వ‌సూళ్లు మాత్రం ఓకే అనిపించాయి. దానికి కార‌ణం.. ఇది సంక్రాంతి సీజ‌న్. మ‌హేష్ కి ఉన్న క్రేజ్‌. త్రివిక్ర‌మ్ పై ఉన్న గురి. పైగా.. అన్నిచోట్లా 'గుంటూరు కారం' సినిమానే క‌నిపిస్తోంది. 


'హ‌నుమాన్‌' బాగున్నా, థియేట‌ర్లు అందుబాటులో లేవు. 'సినిమా ఎలా ఉన్నా.. ఓసారి చూద్దాంలే' అని ఫ్యాన్సూ ఫిక్స‌య్యారు. సంక్రాంతి సీజ‌న్‌లో కాకుండా ఏ వేస‌విలోనో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే, రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేది. అందుకే అనేది.. సంక్రాంతికి మించిన సీజ‌న్ లేద‌ని. సినిమాకి నెగిటీవ్ టాక్ వ‌స్తేనే వ‌సూళ్లు ఇలా ఉన్నాయంటే.. యావ‌రేజ్ అయ్యింటే, హిట్ బొమ్మ అనిపించుకొని ఉంటే.. ఇంకెలా ఉండేదో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS