ప్రతి ఏడాది సంక్రాంతి లానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి సినిమా పండగ మొదలవుతోంది. ఈ ఏడాది 'డాకు మహారాజ్' మూవీతో బాలయ్య, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో వెంకటేష్, 'గేమ్ చేంజర్' మూవీతో రామ్ చరణ్ పోటీ పడుతున్నారు. వీరి సంగతి పక్కన పెడితే ఈ మూడు సినిమాలతో ఆరుగురు హీరోయిన్స్ లక్ తేలనుంది. ఇప్పటివరకు కెరియర్ లో చెప్పకో దగ్గ హిట్ లేక, ఒక్క హిట్ తో మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు ఈ ముద్దు గుమ్మలు. ఏదో ఒకటీ రెండు సినిమాలు చేయటమే తప్ప పెద్దగా గుర్తింపు రావటం లేదు. కానీ ఈ సారి పెద్ద హీరోలతో మెరవనున్న కారణంగా హోప్స్ తో ఉన్నారు. వాళ్ళే కియారా అద్వానీ, అంజలి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతి సినిమాలు వీరి ఫ్యూచర్ని డిసైడ్ చేయనున్నాయి.
రామ్ చరణ్- శంకర్ కాంబో 'గేమ్ ఛేంజర్' లో బాలీవుడ్ బ్యూటీ కియారా, అంజలి నటిస్తున్నారు. కియారా ఇప్పటికే తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ లో నటించింది. ఈ రెండిటిలో ఒకటి హిట్, ఇంకొకటి డిజాస్టర్. దీనితో గేమ్ చేంజర్ హిట్ కియారా టాలీవుడ్ జర్నీని డిసైడ్ చేయనుంది. అంజలి ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నా కెరియర్ సక్సెస్ ఫుల్ గా లేదు. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పరిమితం అయిపోయింది. గేమ్ ఛేంజర్ లో మంచి క్యారక్టర్ పడినట్లు, నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని అంటున్నారు. నిజంగా గేమ్ చేంజర్ అంజలికి కలిసివస్తే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
బాలకృష్ణ - బాబీ కాంబో మూవీ 'డాకు మహరాజ్'. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ బాలయ్యతో ఆడిపాడుతున్నారు. శ్రద్దా శ్రీనాథ్ అప్పుడప్పుడు కొన్ని తెలుగుసినిమాలో కనిపించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. జెర్సీ లాంటి హిట్ ఉన్నా అది నాని ఖాతాలో పడిపోయింది. డాకు మహారాజ్ హిట్ పై శ్రద్దా ఆశలు పెట్టుకుంది. ఇది కలిసి వస్తే తెలుగులో బిజీ అవ్వచ్చు అన్నది శ్రద్దా ఆశ. ప్రగ్యా జైస్వాల్ ఇప్పటికే బాలయ్యతో అఖండలో నటించింది. సీక్వెల్ లో కూడా ఫిక్స్ అయ్యింది. ఇపుడు బాలయ్యతోనే డాకు మహారాజ్ తో బరిలో దిగుతోంది.
వెంకటేష్ - అనిల్ రావి పూడి 'సంక్రాంతికి వస్తున్నాం' లో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మీనాక్షి గత ఏడాది వరుస సినిమాలతో అలరించింది. కానీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. దీంతో వెంకీ పై ఆశలు పెట్టుకుంది మీనాక్షి. ఈ సినిమాతో అయినా తనకి స్టార్ హీరోయిన్ గుర్తింపు వస్తుందని వెయిట్ చేస్తోంది. ఐశ్వర్య రాజేశ్ తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తోంది. ఐశ్వర్య తెలుగులో ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఫస్ట్ టైం వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో నటిస్తోంది. ఈ మూవీ పై ఐశ్వర్య భారీ అంచనాలు పెట్టుకుంది.