వెంకటేష్ వంద కొట్టేస్తాడా?

మరిన్ని వార్తలు

వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబో మూవీ 'సంక్రాంతికి వ‌స్తున్నాం' సూపర్ హిట్ కొట్టింది. వెంకటేష్ కి సంక్రాంతి కలిసి వస్తుంది అని మరొకసారి రుజువు చేసారు. అనిల్ రావిపూడి వెంకీ హ్యాట్రిక్ కొట్టారు. అసలు సిసలైన సంక్రాంతి మూవీగా ప్రేక్ష‌కుల‌ను మన్ననలు అందుకుంది. కావాల్సినంత కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించి సంక్రాంతి హీరోగా నిలిచారు వెంకటేష్. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోతోంది. కలక్షన్ల పరంగా కూడా తిరుగులేదు అనిపించుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే  కలక్షన్లని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ఈ మూవీ ఫస్ట్ డే 45 కోట్లు వసూల్ చేసింది. వెంకీ కెరియర్ లోనే ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ కావటం విశేషం. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ టీమ్ ఒక పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో 'పండ‌గ‌కి వ‌చ్చారు....పండ‌గ‌ని తెచ్చారు' అంటూ పోస్ట్ చేసింది. వెంక‌టేష్ కామెడీ టైమింగ్, అనిల్ మేకింగ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటన, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ ఉన్నా అనిల్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కేవలం తెలుగులోనే తెరకెక్కించారు. మిగతా సౌత్ భాషల్లో కూడా డబ్బింగ్ చేయలేదు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్‌లో కూడా వెంకీ మామ ఈ సారి సత్తా చాటారు. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా ఫస్ట్ డే  7ల‌క్ష‌ల డాల‌ర్లు వసూల్ చేసింది. వెంక‌టేష్ కెరీర్‌లోనే ఓవ‌ర్సీస్‌లో ఈ రేంజ్ క‌లెక్ష‌న్లు రావ‌డం రికార్డ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు టీమ్. పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ త్వరలోనే వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరుతుంది అని వెంకీ ఫాన్స్ ఆశిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS