వంద కోట్ల క్లబ్ లో వెంకీ

మరిన్ని వార్తలు

విక్టరీ వెంక‌టేష్ - అనిల్ రావిపూడి కాంబో మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 14 న రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. అసలు సిసలైన సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అందుకుంది. ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని అలరిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వెంకీ మామ సత్తాచాటుతున్నారు. అంతే కాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా.

వెంకీ, అనిల్ మ్యాజిక్‌కు ఆడియెన్స్ మరోసారి ఫిదా అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది. ఈ మూడు రోజుల లెక్కల్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఫస్ట్ డే 45 కోట్లు వసూల్ చేసి వెంకీ కెరియర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. సెకండ్ డే 32 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో ఆహా అనిపించింది. థర్డ్ డే 29 కోట్ల క‌లక్ట్ చేసింది. కేవలం తెలుగులోనే రిలీజైన ఈ సినిమా మూడు రోజుల కలక్షన్స్ తో వంద కోట్ల క్లబ్ లో చేరింది.

ఈ మూడు రోజుల్లో టోటల్ గా 106 కోట్ల‌ గ్రాస్ వసూల్ చేసినట్లు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఏనీ సెంట‌ర్‌, సింగిల్ హ్యాండ్ విక్ట‌రీ వెంకీ మామ అంటూ మూడు రోజుల క‌లెక్ష‌న్ మొత్తాన్ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. రాను రాను ఇంకా కలక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పండగ రోజుల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టేయటం వలన, హెవీ రష్ కారణంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. పైగా గేమ్ చేంజర్ కి థియేటర్స్ తగ్గించి, సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కలక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS