ఈ సంక్రాంతి వార్‌... ఈ నాలుగు సినిమాల మ‌ధ్యేనా?

మరిన్ని వార్తలు

2023 సంక్రాంతికి ఇంకా ఆరేడు నెల‌ల స‌మ‌యం ఉంది. అయితే... బెర్తుల్ని ఖాయం చేసుకోవ‌డానికి మ‌న హీరోలు ఉత్సాహం చూపించేస్తున్నారు. సంక్రాంతి అనేది కీల‌క‌మైన సీజ‌న్‌. అందుకే.. ముందే రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించేసి యుద్ధానికి స‌న్న‌ద్ధం అంటూ... సంకేతాలు పంపేస్తున్నారు. ప్ర‌తీ సంక్రాంతికీ పెద్ద ఎత్తున సినిమాలు వ‌స్తుంటాయి. 2023 కూడా అందుకు అతీతం ఏమీ కాదు. ఈసారి పండ‌క్కి 4 పెద్ద సినిమాలు బ‌రిలోకి దిగ‌బోతున్నాయి. అందులో రెండు మెగా సినిమాలు ఉండ‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

 

ఈ సంక్రాంతికి చిరు 154 చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు. ఈచిత్రానికి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈచిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈచిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు కూడా సంక్రాంతి టార్గెట్ తోనే రెడీ అవుతోంది. సంక్రాంతికి ఈ రెండు సినిమాలూ వ‌స్తే.. మెగా అభిమానుల‌కు పండ‌గే. విజ‌య్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం `వార‌సుడు` కూడా సంక్రాంతి టార్గెట్‌తోనే రెడీ అవుతోంది. దాదాపుగా రూ.200 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్ర‌మిది. కాబ‌ట్టి అంచ‌నాలు భారీగానే ఉంటాయి.

 

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` మ‌రో ఎత్తు. రామాయ‌ణం ఆధారంగా రూపొందిచ‌న చిత్ర‌మిది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో త‌యార‌వుతోంది. ఇలాంటి సినిమాల‌కు సంక్రాంతికి మించిన సీజ‌న్ ఉండ‌దు. అందుకే... ఆదిపురుష్‌ని కూడా సంక్రాంతి బ‌రిలో నిలిపారు నిర్మాత‌లు. ఈ నాలుగు చిత్రాల్లో క‌నీసం 3 సినిమాలు సంక్రాంతికి విడుద‌ల కావ‌డం ఖాయం. వ‌స్తే నాలుగూ వ‌చ్చేయొచ్చు. వీటితో పాటు ఒక‌ట్రెండు చిన్న సినిమాలూ సంక్రాంతికి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకొనే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి మామూలుగా ఉండ‌దు. ఇది మాత్రం ప‌క్కా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS