నాని ‘దసరా’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు సంతోష్ నారాయణన్. ఈ సినిమా విడుదల కాకముందే మరో పాన్ ఇండియా మూవీ ఆయన ఖాతాలకి వెళ్ళింది. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నట్లు చిత్ర బృందం ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడాయన స్థానం సంతోష్ నారాయణన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వినీదత్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని తెలియజేయలేదు.
సంతోష్ నారాయణ్ విషయానికి వస్తే మ్యూజిక్ పై మాంచి పట్టున్న కంపోజర్. ముఖ్యంగా నేపధ్య సంగీతం అందించడంలో దిట్ట. చాలా సినిమాల్ని తన సంగీతంతో నిలబెట్టాడు. రజనీకాంత్ కబాలి సినిమా నిరాశ పరిచింది గానీ.. ఆ సినిమాకి సంతోష్ అందించిన నేపధ్య సంగీతం ఎవర్ గ్రీన్. ప్రాజెక్ట్ కె నేపధ్య సంగీతానికి ప్రాధాన్యత వున్న చిత్రం. ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ది సరైన ఎంపికే అని చెప్పాలి.