సంతోష్ శోభన్... యంగ్ హీరోల్లో ప్రతిభకు కొదవ లేని కుర్రాడు. అదృష్టం కూడా తోడైంది. వరుసగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు అందుకొంటున్నాడు. కానీ ఏం లాభం? హిట్టే పడడం లేదు. శోభన్ ఇప్పటి వరకూ చాలా సినిమాలే చేశాడు. ఏక్ మినీ కథ తప్ప... ప్రేక్షకుల్ని అలరించిన సినిమాలేం అతన్నుంచి రాలేదు. అది కూడా ఓటీటీలో ఆడింది. థియేటర్లలోకి వస్తే దాని పరిస్థితేమిటో తెలీదు. ఈ సంక్రాంతికి వచ్చిన కల్యాణం కమనీయం డిజాస్టర్. మారుతి దర్శకత్వంలో రూపొందిన మంచి రోజులు వచ్చాయి డిజాస్టర్. ఇప్పుడు శ్రీదేవి - శోభన్ బాబు సినిమాలో నటించాడు. ఈవారమే విడుదల.
ఈ సినిమాతో శోభన్ జాతకం తేలిపోతుంది. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా మారి రూపొందించిన చిత్రమిది. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ సినిమా కూడా అటూ ఇటూ అయితే... వంకలు పెట్టడానికి కూడా ఏం ఉండదు. శోభన్ ని థియేటర్లకు వెళ్లి చూడ్డానికి జనాలకు పెద్దగా ఆసక్తి లేదన్న విషయం అర్థమైపోతుంది. ఇక.. తను నిజంగానే ఓటీటీ హీరోగా మిగిలిపోవడం ఖాయం. ఈ సినిమా కనీసం యావరేజ్ కలక్షన్లు తెచ్చుకొన్నా... శోభన్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు పడతాయి. చిన్న నిర్మాతలకు, కొత్త దర్శకులకు అందుబాటులో ఉంటాడు కాబట్టి.. తన పేరుతో కొన్ని సినిమాలు పట్టాలెక్కుతాయి. మరి.. శోభన్ బాబు ఏం చేస్తాడో చూడాలి.