సప్తగిరి హీరోగా 'వజ్రకవచ ధార గోవిందా'.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌గా ఆలరించిన సప్తగిరి హీరో అవతారమెత్తి అప్పుడే రెండు సినిమాల్లో నటించేశాడు. రెండు సినిమాలూ ఓ మోస్తరు విజయాన్ని అందించాయి సప్తగిరికి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ కొత్త సినిమాకి 'వజ్రకవచ ధార గోవిందా' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్‌ లోగోని తాజాగా విడుదల చేశారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 

 

ఇదిలా ఉంటే, సప్తగిరి హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలూ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌', సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' అని తన పేరుతోనే విడుదల చేశారు. సప్తగిరి పేరు సంగతి అటుంచితే, సప్తగిరి అంటే స్వయంగా ఆపద మొక్కుల వాడు, అందరి దైవం ఆ ఏడుకొండల స్వామి. ఆ సెంటిమెంట్‌ రెండు సినిమాలకూ వర్కవుట్‌ అయ్యింది సప్తగిరికి. అదే సెంటిమెంట్‌తో మూడో సినిమాలోనూ ఆ గోవిందనామం వచ్చేలా చూసుకున్నాడు. 

 

అందుకే 'వజ్రకవచ ధార' చివరిలో 'గోవిందా'. కామెడీలోనే కాదు, టైటిల్స్‌ ఎంపికలోనూ సప్తగిరి ఇన్ఫో బాగానే ఉంది. అయితే వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి మరి. అన్నట్లు సప్తగిరి తొలి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కూడా అరుణ్‌ పవారే. ఈ ఇద్దరూ పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమానులే కావడం మరో విశేషం. చూడాలి మరి సప్తగిరికి గోవిందుడు ఈ సారి కూడా సక్సెస్‌ ఇస్తాడేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS