అడల్ట్‌ హర్రర్‌ కామెడీ: 'చీకటి గదిలో చితక్కొట్టుడు'.!

By iQlikMovies - January 02, 2019 - 17:10 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో అడల్ట్‌ కామెడీ సినిమాలు సహజంగానే చూస్తుంటాం. కానీ టాలీవుడ్‌లో మాత్రం చాలా రేర్‌గా వస్తుంటాయి అలాంటి సినిమాలు. అయితే ఈ మధ్య అడల్ట్‌ కామెడీకి హారర్‌ని జోడించడం కొత్త సక్సెస్‌ ఫార్ములాగా ఎంచుకుంటున్నారు. ఆ కోవలో వచ్చిన కొన్ని సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. కొన్ని ఫెయిలయ్యాయి. అయితే తాజాగా ఓ అడల్ట్‌ హారర్‌ కామెడీ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

 

'గరుడవేగ', '24 కిస్సెస్‌' వంటి సినిమాలతో ఆకట్టుకున్న యంగ్‌స్టర్‌ అదిత్‌ అరుణ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నిక్కీ తంబోలీ, భాగ్యశ్రీ మోతే, మిర్చి హేమంత్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ తరహాలో ఇంతవరకూ వచ్చిన సినిమాలన్నింట్లోనూ ఈ సినిమా కాస్త డిఫరెంట్‌గా ఉండనుందట. అలాగే హాట్‌ అప్పీల్‌ కూడా ఎక్కువగానే ఉంటుందనీ తెలుస్తోంది. 

 

హద్దులు దాటే శృంగార సన్నివేశాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నాయని సమాచారమ్‌. ఇదంతా ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్‌. రేపు ఈ సినిమా టీజర్‌ని వదలనున్నారట. ఆ టీజర్‌ చూస్తే ఓ ఐడియాకొచ్చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ రకమైన రా కంటెన్ట్‌ మూవీస్‌కి యూత్‌ ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. అయితే మరీ బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీ అయితే వివాదాలు తప్పవు. చూడాలి మరి, ఈ 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సంగతేంటో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS