రంజాన్ అంటే హైదరాబాద్ లో గుర్తొచ్చేది రెండే రెండు. ఒకటి హలీం రెండోది చార్మినార్ వద్ద ఉండే చుడి బజార్ లో గాజులు. ఈ రెండిటి కోసం ఈ రంజాన్ సీజన్ లో హైదరాబాద్ కి వేరే ప్రదేశాల నుండి వస్తుంటారు అంటేనే వీటి ప్రత్యేకత ఏంటో మనకి తెలిసిపోతుంది.
ఇక తాజాగా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన తల్లి అమ్రితా సింగ్ (మాజీ నటి)తో కలిసి నిన్న చార్మినార్ వద్ద రంజాన్ షాపింగ్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది. సారా ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రం హిందీ రీమేక్ సింబాలో హీరోయిన్ గా నటిస్తున్నది.
ఈ చిత్రమే ఆమెకి బాలీవుడ్ లో తొలి చిత్రం కానుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా ఈ తల్లి కూతుళ్ళు నిన్న షూటింగ్ అయిపోయాక చార్మినార్ వద్ద సందడి చేశారు.
అయితే వీరి రాక పైన ఎవరి సమాచారం లేకపోవడంతో వీరు అక్కడికి వచ్చిన సమయంలో మీడియా దృష్టి వీరి పైన పడలేదు.