జబర్దస్త్ కామెడీ షో తో పాపులారిటీ సంపాదించుకున్న చలాకీ చంటికి తృటిలో పెద్ద రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డాడు.
ఆ వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారుని వెనుక నుండి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది, దీనితో ఈ రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక ముందు కారులో ఉన్న కమెడియన్ చంటికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇక స్వల్ప గాయాలు అయిన చంటిని దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి ప్రాధమిక చికత్స కోసం పంపించడం జరిగింది.
ప్రమాదం జాతీయ రహదారి పైన జరగడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. అయితే చిన్నపాటి గాయాలే అవ్వడంతో చలాకీ చంటికి ఎటువంటి ప్రమాదం లేదు అని తెలుస్తుంది.