'పంజా' సినిమాలో పవన్‌కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించిన సారా జేన్ డియాస్ గుర్తుందా? ఆ బ్యూటీనే ఇప్పుడిక్కడ బికినీలో మీరు చూస్తున్నది. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ, ఓ తమిళ సినిమాలోనూ మెరిసిన సారా జేన్ డియాస్, ఇటలీలో తన బికినీ సొగసుల్ని ఇదిగో ఇలా ఆరేసేసింది. బీచ్‌లో స్విమ్మింగ్ తనకెంతో ఇష్టమని చెప్పే సారా జేన్ డియాస్, బికినీ గ్లామర్‌తో కుర్రకారుకి కిర్రాకు పుట్టించడం తనకేమీ కొత్త కాదని చెబుతోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ హాట్ అప్పీల్ కోసం అందాల భామలు తమ ఫిజిక్‌ని పెర్‌ఫెక్ట్‌గా వుంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందంటూ గ్లామరస్‌గా 'స్వీట్ పెయిన్' గురించి వివరించేసింది. ఛాన్సొస్తే మళ్ళీ తెలుగు సినిమాల్లో నటిస్తానంటోందిగానీ, ప్చ్.. ఈ బ్యూటీకి ఆ అవకాశం ఇచ్చేవారే కన్పించడంలేదు. అప్పుడప్పుడూ బాలీవుడ్ సినిమాలు చేస్తూ టైమ్ పాస్ చేసేస్తోంది అందాల సారా జేన్.