గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ బికినీ 'పంజా'.!

మరిన్ని వార్తలు

పిక్‌లో బికినీతో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా.? పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో 'పంజా' సినిమాలో నటించింది. పేరు సారా జేన్‌ దియాస్‌. కెరీర్‌ తొలినాళ్లలోనే తెలుగులో పవర్‌స్టార్‌ సరసన నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించుకున్నా ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించకపోవడం, తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్‌కి టాటా బైబై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేయడం అంతా ఫాస్ట్‌ ఫాస్ట్‌గా జరిగిపోయాయ్‌.

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడా చెప్పుకోదగ్గ స్టార్‌డమ్‌ సంపాదించుకోలేకపోయింది. తెలుగులో 'పంజా' సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌కెళ్లాక ఓ రేంజ్‌ గ్లామర్‌ ప్రదర్శించేసింది. బక్క పలచని అందాలు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, అక్కక కూడా ఈ బ్యూటీ బోర్‌ కొట్టేసినట్లుంది.

ప్రస్తుతం చేతిలో ఎలాంటి అవకాశాలు లేవు. సో ఇదిగో సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో టైం పాస్‌ చేసేస్తోంది. ఛాన్స్‌ ఉంటే మరోసారి టాలీవుడ్‌ని పలకరించేందుకూ సిద్ధమే అంటోంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS