జీరోసైజ్ అందాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే ముగ్గులోకి దించేసింది. గన్ పట్టి, గూండాలను ఏరి పారేసే పవర్ ఉన్న వ్యక్తిని పూలు, మొక్కలు చూపించి పల్లెటూరికి రప్పించేలా చేసింది. ఏంటీ స్టోరీ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'పంజా' కథలెండి. ఆ కథలోని హీరోయినే మన పిక్ టాక్ బ్యూటీ సారా జైన్. బాలీవుడ్ భామ. తెలుగులో ఆ ఒక్క సినిమాలోనే నటించింది. బక్క పలచని అందాలతో పెద్దగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయిందనుకోండి.
సినిమా కూడా అంతంత మాత్రమే సక్సెస్ కావడంతో తర్వాత అమ్మడిని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. కానీ, బాలీవుడ్లో మాత్రం ఈ సైజ్ జీరో బ్యూటీ యాక్టివ్గానే ఉంది. ఒకటీ అరా సినిమాలు చేస్తూ కెరీర్‌ని అలా అలా నడిపించేస్తోంది. అప్పుడప్పుడూ బికినీ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఇదిగో ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్లో తన క్లీవేజ్ సొగసుల్ని ఇలా ఎగ్జిబిషన్‌కి పెట్టింది. ఒక కాలుపై ముందుకు వంగి మరీ హాట్ హాట్ అందాల విందు చేస్తోంది. గాలికి ఎగిరే నల్లని కురులు ఆమెలోని సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ని ఆడియన్స్‌కి చూపిస్తున్నాయి. నిజంగానే సారా హాట్ పోజు సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది.