'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా మూడు సినిమాల్ని లైన్‌లో పెట్టి రంగంలోకి దిగాడు. మొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో 'అల వైకుంఠపురములో' సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. తర్వాత వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్ - కనబడుటలేదు', సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే, సుకుమార్ స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాని కారణంగా త్వరలోనే వేణు శ్రీరామ్ సినిమాని పట్టాలెక్కించనున్నాడట అనే ప్రచారం జరుగింది.
అయితే, ఆ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. బన్నీ నెక్ట్స్ సినిమా సుకుమార్‌తోనే ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవలే బన్నీకి సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాడనీ, బన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాడనీ తాజా టాక్. అంతేకాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా పూర్తి అవ్వడంతో సంబంధం లేకుండానే సుకుమార్ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడట బన్నీ. మరోవైపు వేణు శ్రీరామ్ సినిమా కూడా పట్టాలెక్కించేస్తాడట.
అయితే, 'అల వైకుంఠపురములో' కంప్లీట్ అయ్యాకా, ఈ సినిమాని స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలూ సమాంతరంగా కంప్లీట్ చేస్తాడట. ఏది ఏమైనా బన్నీ నుండి ఈ ఏడాది సినిమా వచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సంవత్సరంలో ఫ్యాన్స్ కోసం మరో సినిమాని కూడా బన్నీ ప్లాన్ చేయనున్నాడట. ప్లానింగ్ అయితే బాగుంది కానీ, ఎంత మేర ఇది వర్కవుట్ అవుతుందో చూడాలిక.