గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ వైల్డ్‌ పంజా.

మరిన్ని వార్తలు

తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన సారా జేన్‌ డియాస్‌, ఆ ఒక్క తెలుగు సినిమాతోనే టాలీవుడ్‌ నుంచి కనుమరుగైపోయింది. తొలి సినిమానే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో చేసే అవకాశం దక్కినా, ఆ తర్వాత ఆమె టాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. స్వతహాగా మోడలింగ్‌ రంగంపై మక్కువ వుండడంతో, ఆ రంగంలోనే సెటిలైపోయింది సారా జేన్‌ డియాస్‌. పవన్‌ కళ్యాణ్‌ సరసన ఆమె 'పంజా' సినిమాలో నటించిన విషయం విదితమే. సినిమాలు చేతిలో లేకపోయినా, ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ హాట్‌ హాట్‌ ఫొటోల్ని షేర్‌ చేస్తూ వుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

wild. always... . #borntobewild #wildchild #wildwoman #wildheart #wild

A post shared by Sarah Jane Dias (@sarahjanedias) on

ఈ క్రమంలో ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన పై ఫొటో వైరల్‌గా మారింది. 'వైల్డ్‌...' అంటూ ఆమె పోస్ట్‌ చేసిన ఈ ఫొటోతో నిజంగానే ఆమె హాట్‌ అండ్‌ వైల్డ్‌గా కుర్రకారు గుండెల్ని చిందర వందర చేసేస్తోంది. తనకు ట్రావెల్‌ చేయడమంటే ఇష్టమనీ, ఎప్పుడూ ప్రపంచంలో ఏదో ఓ ప్రాంతాన్ని సందర్శిస్తూ, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తుంటాననీ చెబుతోన్న సారా జేన్‌కి బీచ్‌ అంటే చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏంటో, ఈ వైల్డ్‌ ఫొటోతోనే తెలిసిపోతోందిగా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS