వరుణ్ సందేశ్ అంటే ఇంతవరకూ యూత్‌ఫుల్ హీరోగానే అందరికీ తెలుసు. కానీ, ఆయన బిగ్‌బాస్‌లోకి వచ్చాకే, అసలు వరుణ్ అంటే ఇదీ అని తెలిసింది. మిస్టర్ కూల్, మిస్టర్ పర్‌ఫెక్ట్ అనే బిరుదులు హోస్ట్ నాగార్జునే ఇచ్చేశాడు. క్లైమాక్స్‌లో జర్నీ చూపించే క్రమంలోనూ బిగ్‌బాస్ కూడా వరుణ్‌ని అవే బిరుదులతో అభివర్ణించారు. నిజంగానే హౌస్‌లో ఆయన బిహేవియర్‌రి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఆయన ప్రదర్శించిన హుందాతనం, ఓర్పు అందర్నీ మెస్మరైజ్ చేశాయి. తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. జెన్యూన్ గేమ్ స్ట్రాటజీని ఫాలో చేశాడు. ఇవన్నీ టైటిల్ విన్నింగ్‌కి వరుణ్ ప్లస్ పాయింట్స్‌గా చెప్పొచ్చు. అయితే, స్టార్టింగ్‌లో మహేష్ విట్టాతో గొడవ పడిన వైనం, మధ్యలో ఓ సారి రాహుల్‌తో గొడవ వరుణ్ సందేశ్‌ని కాస్త డీగ్రేడ్ అయ్యేలా చేశాయి కానీ అవన్నీ సందర్భానుసారం వచ్చినవే.. ఒకరకంగా గేమ్ స్ట్రాటజీ అనుకోవాలి. టోటల్‌గా ఆడియన్స్ మనసు దోచుకున్నాడు వరుణ్ సందేశ్. అంతేకాదు, హౌస్ మేట్స్ మధ్య కూడా వరుణ్ అంటే ఓ మంచి అభిప్రాయమే ఉంది.
ఇక వరుణ్‌కి బయటి నుండి ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆ ఫాలోయింగ్‌తోనే ఎన్ని సార్లు నామినేట్ అయినా సేవ్ అవుతూ వచ్చాడు. ట్రోఫీ విషయానికి వస్తే, వరుణ్ సందేశ్ ట్రోఫీ గెలుచుకోవడానికి ఏమాత్రం ఢోకా లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం వరుణ్ ఫ్యామలీ అంతా అమెరికా నుండి హైద్రాబాద్‌కి వచ్చేశారట. అంటే వరుణ్ విజయం దాదాపు ఖరారైనట్లే.. అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.