'పంజా'తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సారా జైన్ అప్పుడప్పుడూ సోషల్ ట్రీట్ ఇస్తూ, తెలుగు ఆడియన్స్‌ని మెరుపుతీగలా మురిపిస్తుంటుంది. తాజాగా సారా పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బికినీకి కొంచెం ఎక్కువ అనిపించేలా ఉన్న కాస్ట్యూమ్‌కి అదనపు యాక్సెసరీస్‌తో వన్నెలు అద్దింది. ముడి వేసిన కుచ్చుల చేతుల ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ సెక్సప్పీల్ తీసుకొచ్చేసింది.
ఇక పాప ధరించిన యాక్సెసరీస్ మాటకొస్తే, కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టింది. గుండ్రని షేప్‌లో ఉన్న ఓ లాంగ్ హ్యాండ్ బ్యాగ్‌ని భుజానికి వేలాడదీసింది. ఓ కాలు గోడకు తన్నిపెట్టి కిందికి చూస్తూ, స్టైల్‌గా ఓ పోజిచ్చింది. మెడలో సింపుల్‌గా ఓ చైన్ ధరించింది. సింపుల్‌గా ఉండే స్లిప్పర్స్ కాక, హెయిర్ స్టైల్ కూడా సింపుల్‌గా ఉండేలా చూసుకుంది. ఒక సైడ్‌లో ముఖం పైకి వచ్చేలా తీసిన ఫంక్ సూపర్బ్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. టోటల్‌గా ఈ పిక్ గ్లామర్‌ని లొకేషన్ మరింత హైలైట్ చేస్తోంది.