గ్లామ్‌షాట్‌: ఔరా అనేలా సారా గ్లామర్‌ 'పంజా'!

మరిన్ని వార్తలు

'పంజా' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ సారాజైన్‌. సినిమా విజయవంతం కాలేదు. అమ్మడి బక్క పలచని అందాలు కూడా తెలుగు ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు. దాంతో అమ్మడు బ్యాక్‌ టు ఫెవిలియన్‌ అన్నట్లుగా బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ మాత్రమే ఈ బక్క పలచని అందాలకు ఆదరణ ఉంటుంది.

 

అయితే అక్కడ కూడా ఒకటీ అరా సినిమాలు తప్ప, చెప్పుకోదగ్గ స్టార్‌డమ్‌ సంపాదించుకోలేదీ బ్యూటీ. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడే అమ్మడిలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని బికినీ మాటున దాచి ఉంచి, ఎక్స్‌పోజ్‌ చేస్తుంది. ఈ ఎక్స్‌పోజింగ్‌కి సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తుంటాయి. అయినా పాప ఏమాత్రం పట్టించుకోదంతే.

 

తాజా పిక్‌ విషయానికి వస్తే, సింగిల్‌ పీస్‌ పర్‌పుల్‌ కలర్‌ బికినీలో సారా ఔరా అనిపిస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో కాన్సెప్ట్‌ పెయింటింగ్‌ వాల్‌ అమ్మడి అందాలను కాస్త డిస్ట్రబ్‌ చేస్తున్నా, ఇంతవరకూ సారా ఇచ్చిన పోజుల్లో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ స్టిల్‌ ఇది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS