బిగ్ బాస్ నుంచి తొలి వారం నుంచే బయటకు వచ్చేసింది సరయూ. తనో యూ ట్యూబ్ స్టార్. అడల్ట్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ లో బోల్డ్ గా మాట్లాడి, కుర్రకారు అభిమానం సంపాదించింది. వాళ్ల అండ దండతో కనీసం నాలుగైదు వారాలైనా బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్నారంతా. కానీ అనూహ్యంగా తొలి ఎలిమినేషన్ ఆమెదే. నిజానికి బిగ్ బాస్ హోస్ లోకి అడుగుపెట్టేటప్పుడు `కనీసం మూడు వారాలు ఉంటావ్ ` అంటూ యాజమాన్యం మాట ఇచ్చిందట. అందుకోసమే సరయూ వచ్చిందట. పైగా బయటకు వచ్చాక.. బిగ్ బాస్ పాత ఎపిసోడ్లు చూసి బోరు మంటోందట.
`నా ఫుటేజీని సరిగా చూపించలేదు. కావాలనే కట్ చేశారు` అంటూ సన్నిహితుల దగ్గర వాపోతోందట. అంటే కావాలని ఆమెను తొక్కేసినట్టే కదా?? నిజానికి సరయూ కంటే వీక్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హోస్ లో ఉన్నారని, సరయూని అనవసరంగా బయటకు పంపేశారని ఓ టాక్ వినిపిస్తోంది. కాకపోతే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెకు మళ్లీ అవకాశం రావొచ్చని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో..?? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఒకలా.. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పుడు మరోలా మాట్లాడడం సెలబ్రెటీలకు అలవాటే. సరయూ కూడా అదే చేస్తోందిప్పుడు.