అనిల్ రావిపూడి ఇంట్లో మొద‌లైన సంబ‌రాలు.

By Gowthami - January 05, 2020 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

అనిల్ రావిపూడికి ఈ సంక్రాంతి చాలా కీల‌కం. బిగ్ లీగ్‌లో ఆయ‌న చేర‌తారా? లేదా? అనే సంగ‌తి జ‌న‌వ‌రి 11న తేలిపోతుంది. అయితే అంత‌కంటే ముందు ఆయ‌న ఇంట్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. అదెలా అంటారా..? ఈ ద‌ర్శ‌కుడికి తండ్రిగా ప్ర‌మోష‌న్ వ‌చ్చిందండీ.

 

ఈరోజే ఆయ‌న స‌తీమ‌ణి పండండి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అందుకే ఆయ‌న ఇంట్లో ముందే పండ‌గ సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. అన్న‌ట్టు ఇదే రోజు హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ర‌ష్మిక నాయిక‌. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈరోజు 9 గంట‌ల‌కు స‌రిలేరు నీకెవ్వ‌రు థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ కూడా విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS