సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు... మహేష్ బాబు కెరీర్లో మరో విజయాన్ని అందించింది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా, అల వైకుంఠపురములో నుంచి గట్టి పోటీ ఎదురైనా, సంక్రాంతి సీజన్‌ని బాగానే క్యాష్ చేసుకోగలిగింది. తొలి వారాంతంలో 85 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో రూ.27.7 కోట్లు, సీడెడ్‌లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, ఈస్ట్ 8.19 కోట్లు, వెస్ట్ 5.61 కోట్లు సాధించింది.
కృష్ణా నెల్లూరులో దాదాపు 11 కోట్లు తెచ్చుకుంది. శని, ఆదివారాలు కూడా ఈ సినిమా ఇదే జోరు చూపిస్తే 100 కోట్ల షేర్ తెచ్చేసుకుంటుంది. బయ్యర్లు కూడా బ్రేక్ ఈవెన్‌లో పడతారు. వచ్చేవారం డిస్కోరాజా విడుదల అవుతోంది. ఈలోగా వీలైనన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.