ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు జనవరి 12న సంక్రాంతి పుంజుల్లా తలపడాలనుకున్న సంగతి తెలిసిందే. ఒకేరోజు వచ్చి నువ్వా.? నేనా.? అని తేల్చుకోవాలనుకున్నారు. కానీ, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడమంటే, టెక్నికల్‌గా చాలా ప్రాబ్లెమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ధియేటర్స్ కొరత ఉంటుంది.
ఈ లాజిక్‌ని మిస్ చేసుకుని ఈ ఇద్దరూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడడానికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తలంపు మంచిది కాదని, ఇరు సినిమాల నిర్మాతలు వాడి వేడిగా చర్చలు జరిపారు. దాని పర్యవసానం మహేష్ 'సరిలేరు నీకెవ్వరు..' మూవీని ముందుగా అనుకున్న తేదీకి ఒక రోజు ముందుగా అంటే, జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తాజాగా ప్రకటించారు.
అంటే జనవరి 11న మహేష్ 'సరిలేరు..'తో, జనవరి 12న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో..' తో సందడి చేయనున్నారన్న మాట. సేమ్ రిలీజ్ డేట్‌తో ఇప్పటికే సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య సైలెంట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ ముందుకు రావడంతో, ఆ వార్ కాస్త సైలెంట్ అయ్యే అవకాశాలున్నాయి.