సంక్రాంతి రేస్‌లో ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సరిలేరు నీకెవ్వరు..'. ఈ మధ్య మహేష్ నుండి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ కొరవడుతున్నాయి అన్న లోటు ఈ సినిమాతో తీరిపోయింది. టీజర్లో మహేష్ చెప్పినట్లే 'బొమ్మ దద్దరిల్లిపోయింది. మహేష్ మ్యానరిజమ్ డైలాగులు, యాక్షన్, ఎమోషన్, స్టోరీ.. అన్నీ సూపర్బ్ అంటున్నారు. బొమ్మ సూపర్ హిట్ అనే టాక్ వస్తోంది. అన్ని వైపుల నుండీ పాజిటివ్ టాక్ వస్తోంది 'సరిలేరు..'కు.
రివ్యూలు బాగుండడంతో, సినిమాకి జనం పోటెత్తుతున్నారు. ఆల్రెడీ ఆడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోవడంతో, ఎక్స్ట్రా బెనిఫిట్ షోల కోసం జనం ఉరకలు వేస్తున్నారు. ప్రీమియర్స్ నుండి టాక్ బాగుండడంతో 'సరిలేరు..'కు భారీ ఓపెనింగ్స్ రానున్నాయనీ, సంక్రాంతి సీజన్ మహేష్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపిందనీ అంటున్నారు. మహేష్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని రన్ చేస్తారనీ అంటున్నారు. అనిల్ రావిపూడి ఖాతాలో మరో హిట్ జమ అయిపోయింది 'సరిలేరు..'తో. తన టైమింగ్ కామెడీని ఈ సినిమాలోనూ అనిల్ రావిపూడి కంటిన్యూ చేశారు. సక్సెస్ అయ్యారు. రష్మికా క్యూట్ అప్పీల్, విజయ శాంతి అప్పియరెన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్లో ఉంచాయి. టోటల్‌గా 'సరిలేరు..'ను ఇప్పటికైతే హిట్ బొమ్మగా తేల్చేశారు. ఇక ఫైనల్ టాక్ సాయంత్రానికల్లా రానుంది.