ఈ సంక్రాంతి పండక్కి మహేష్ అభిమానుల సంబరాలు రెట్టింపు కానున్నాయి. ఎందుకంటే `సరిలేరు నీకెవ్వరు` ఈ పండక్కే వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. సెన్సార్ పూర్తయ్యింది. యూ బై ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలోని హెలెట్స్ ఏమిటన్నవి ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి.
*ఈ సినిమా నిడివి 167 నిమిషాలు
*తొలి భాగంలో ఆర్మీ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని, సైనికుల గొప్పదనం గుచించి చెప్పే సీన్ ప్రారంభ సన్నివేశాల్లో హైలెట్‌గా నిలవబోతోందని తెలుస్తోంది.
*మహేష్‌బాబు కర్నూలు వచ్చాక.. కథలో కీలకమైన మలుపు వస్తుంది. అక్కడి నుంచి ఎమోషనల్ డ్రామా మొదలవుతుంది.
*రష్మికతో ఓ ట్రైన్ జర్నీ ఎపిసోడ్ ఉంది. దీని నిడివి దాదాపుగా 30 నిమిషాలు. ఆ అరగంట హిలేరియస్‌గా సాగుతుందని, మహేష్ కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుందని తెలుస్తోంది.
*విజయశాంతి - మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలం కానున్నాయి.
*ఎలకకు సంబంధించిన సీన్ ఒకటుంది. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.
*నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్.. అనే ఊతపదంతో మహేష్ కామెడీని అరదగొట్టేశాడట.
*పాటలు యావరేజ్‌గాఉన్నా, థియేటర్లో మాత్రం ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా ఉంటాయని, రెండు పాటల్లో మహేష్ డాన్సులు అదరగొట్టాడని చెబుతున్నారు.
*క్లైమాక్స్‌లో ఎమోషన్ బాగా వర్కవుట్ అయిందని టాక్.
*సినిమా అయిపోయాక కూడా మరో 5 నిమిషాలు కామెడీ బిట్ ఉంటుందట. అది చూసి జనాలు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు.