ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు సాధించింది. మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు టీఆర్పీ రేటింగుల పరంగానూ... తన సత్తా చూపిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని రెండోసారి టీవీలో ప్రదర్శిస్తే.. ఏకంగా 17.4 రేటింగు సాధించింది. సాధారణంగా ఓ సూపర్ హిట్ సినిమా తొలిసారి ప్రదర్శిస్తున్నప్పుడు వచ్చే రేటింగు ఇది. రెండోసారీ.. అదే స్థాయిలో వ్యూవర్ షిప్ ఉండడం నిజంగా ఓ రికార్డే. లాక్ డౌన్ కాలమిది.
థియేటర్లో సిఇనమాల్లేవు. వినోదం కోసం టీవీలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పైగా మహేష్ నటించిన హిట్ సినిమా ఆయె. అందుకే... రెండోసారీ భారీ రేటింగులు వచ్చాయి. నిజానికి మహేష్ సినిమాలు థియేటర్ దగ్గర ఫ్లాప్ అయినా, టీవీల్లో మంచి రేటింగులే వస్తుంటాయి. 'ఖలేజా'సినిమాకి సైతం.. మంచి టీఆర్పీలు వస్తుంటాయి. ఇక హిట్ సినిమాలకు ఎందుకు తగ్గుతాయి. అందుకే సరిలేరు మరోసారి తన మ్యాజిక్ చూపించింది.