వర్మ సినిమా 'నగ్నం' ఈమధ్య ఆన్ లైన్ లో విడుదలైంది. ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోలేదు గానీ, అందులో నటించిన స్వీటీ గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చింది కదా, అందుకే ఆ పాఠాలు, యవ్వారాలూ స్వీటీకి బాగానే వంట పట్టాయి. ఏ ఇంటర్వ్యూలో చూసినా, ఏదో ఓ కాంట్రవర్సీ లాగి, మెల్లమెల్లగా పాపులర్ అయిపోదామని చూస్తోంది. ఇప్పుడు రాశీఖన్నాపై తన బాణాన్ని వదిలింది స్వీటీ. రాశీఖన్నాకీ స్వీటీకి సంబంధం ఏమిటంటారా? కొన్నాళ్లు రాశీఖన్నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.
`సుప్రీమ్` సినిమాకి స్వీటీనే కాస్ట్యూమ్ డిజైనర్. .ఆ సినిమా సమయంలో తనని రాశిఖన్నా టార్చర్ పెట్టిందని. రాత్రి మూడు గంటలకు ఫోన్ చేసి, తనకి చీర కట్టమని చెప్పిందంటోంది స్వీటి. తాను సహాయకురాల్ని పంపుతానన్నా ఒప్పుకోలేదని, తానే స్వయంగా రావాలని చెప్పిందని, అలా తనని ఓ రకమైన టార్చర్‌కి గురి చేసిందని చెప్పుకొచ్చింది. ఈ విషయం దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా తెలుసట. మొత్తానికి స్వీటీ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాశీ స్పందిస్తుందో లేదో చూడాలి.