తెలుగునాట సినిమాలకి పండగలకి విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి పండగకి ఏదో ఒక సినిమా విడుదలవ్వడం, ఆ పండగపూట ప్రేక్షకులు ఆ సినిమాకి వెళ్ళడం సర్వసాధారణం.
అయితే ఈ దీపావళికి మాత్రం తెలుగులో అంతగా ఆసక్తిరేపే చిత్రం విడుదల కాలేదు. పోయిన వారం విడుదలైన సవ్యసాచిని ప్రేక్షకులు తిప్పికోట్టగా ఈ వారం మరే పెద్ద సినిమా లేకపోవడంతో ఒకరకంగా తెలుగు ప్రేక్షకులకి దీపావళికి సరైన సినిమా లేకుండానే గడిచిపోయింది.
ఈ తరుణంలో తమిళ స్టార్ హీరో విజయ్-దర్శకుడు మురుగదాస్ కలయికలో వచ్చిన సర్కార్ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీరి కలయికలో వచ్చిన తుపాకి & కత్తి పెద్ద హిట్స్ అవ్వడంతో ఈ సినిమా పైన కూడా అంచనాలు బాగానే పెరిగిపోయాయి.
అయితే కథాబలం ఉన్నప్పటికి కొన్ని సన్నివేశాలు నమ్మశక్యంగా లేని కారణంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు యావరేజ్ గా తేల్చేశారు. కాకపోతే సరైన తెలుగు సినిమా లేని కారణంగా ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు బాగానే రాబట్టగలిగింది ఈ అనువాద చిత్రం.
ఇక వైవిధ్య దర్శకుడు రవిబాబు నుండి వచ్చిన మరో ప్రయోగాత్మక చిత్రం అదుగో. పంది పిల్లని ప్రధాన పాత్రలో ఎంచుకుని తీసిన ఈ చిత్రానికి హైప్ బాగానే వచ్చినా ధియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులకి మాత్రం నీరసం వచ్చింది. VFX పరంగా పంది పిల్లకి సంబంధించిన షాట్స్ ని తెరపైన బాగానే చూపించగలిగాడు.
దీనికి ప్రధాన కారణం చిత్రంలోని పాత్రలు, వాటి తాలుకా పాత్ర చిత్రీకరణలు ఆడియన్స్ ఓపికకి పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయి. దీనితో ఈ ప్రయోగం కాస్త ఓ విఫల ప్రయోగంగా మిగిలిపోయింది అని చెప్పొచ్చు.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.