మహేష్ - పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `సర్కారు వారి పాట`. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 12న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ సినిమా అంటే.. యాక్షన్, స్టైల్ ఇవే ఉంటాయనుకుంటారు. అయితే.. సర్కారు వారి పాటలో అంతకు మించిన కమర్షియల్ అంశాలు పొందుపరిచాడట.
మహేష్ స్వతహాగా మంచి వెటకారి. తన మాటల్లో ఫన్ కనిపిస్తుంది. ఖలేజాలో త్రివిక్రమ్ అదే చూపించాడు. ఇప్పుడు మళ్లీ `సర్కారు వారి పాట`తో పరశురామ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడట. మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఆ వెటకారం బాగా వాడేసుకున్నాడట. పరశురామ్ ఫన్ ని బాగా క్రియేట్ చేయగలడు. మహేష్ తో ఆ ఫన్నీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయట. దానికి తోడు.... కీర్తి సురేష్ తో 40 నిమిషాల ట్రాక్ అదిరిపోయిందని తెలుస్తోంది. కీర్తిని ఏడిపిస్తూ.. మహేష్ ఆడే వెటకారం నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని, ఈ సినిమాకి ఈ లవ్ ట్రాకే ప్లస్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.