మైత్రీ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన మరో భారీ సినిమా `సర్కారు వారి పాట`. తొలి రోజు ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. ఆ టాక్ చూస్తే... ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పవేమో అనిపించింది. అయితే క్రమంగా ఈసినిమా నిలబడింది.
మహేష్ స్టామినా, చిత్ర బృందం చేసిన ప్రమోషన్లతో బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లనేరాబట్టింది. తొలి మూడు రోజుల్లో వంద కోట్లకు పైనే వసూలు చేసింది. రెండు వారాలు గడిచాక.. 200 కోట్లు దాటిందని చిత్ర బృందం ప్రకటించింది. మూడో వారంలోనూ ఇంకా ఈ సినిమా థియేటర్లలోనే ఉంది. ఎఫ్ 3 విడుదవ్వడం, దానికి మంచి టాక్ రావడంతో.. సర్కారు వారి పాటకు వసూళ్లు భారీగా పడిపోయాయి. ఈ శని, ఆదివారాలు ఏమాత్రం వసూలు చేస్తుందన్నదానిపైనే సర్కారు వారి పాట ఫైనల్ రిజల్ట్ ఆధార పడి ఉంది. ఎటు చూసినా. ఈ సినిమా వాళ్ల కనీసం 10 నుంచి 15 కోట్ల మేర మైత్రీ మూవీస్ నష్టపోతోందని టాక్. రూ.15 కోట్లంటే పెద్ద మాటే గానీ, పెద్ద సినిమాల విషయంలో ఇది చాలా చిన్న మార్జిన్.
తొలి రోజు టాక్ చూస్తే కనీసం రూ.50 కోట్లయినా ఎగిరిపోతుందనిపించింది. రూ.15 కోట్లతో తప్పించుకుందంటే మైత్రీ అదృష్టమే అని చెప్పాలి. ఎఫ్ 3 రిపోర్ట్ కాస్త అటూ ఇటూ ఉంటే గనుక.. సర్కారు వారి పాటకు కాస్త కలిసొచ్చును. ఎఫ్ 3 హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. సర్కారు వారి పాట ఫైనల్ రన్ కూడా ముగిసినట్టైంది.