''సర్కారు వారి పాట'లో మహేష్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. హీరోయిన్ పాత్ర కళావతికి10వేల డాలర్లు అప్పు ఇస్తాడు. తర్వాత మరో 15వేల డాలర్లు మహేష్ నుండి తీసుకుంటుంది కళావతి. మొత్తం కలిపితే 25వేల డాలర్లు. అయితే మహేష్ మాత్రం తన దగ్గర తీసుకున్న 10వేల డాలర్లు వెనక్కి ఇచ్చేమని అడుగుతాడు. తీసుకున్న మొత్తం 25వేల డాలర్లు ఐతే 10వేల డాలర్లు అడగడం ఏమిటి ? ఈ పాయింట్ ని చాలా మంది విమర్శకులు కంటిన్యుటీ లోపమని విమర్శించారు. ఇంతపెద్ద సినిమాలో కనీసం ఈ లెక్క చుసుకోరా ? పైగా కథలో ఆ పాయింట్ చాలా కీలకం కూడా. అలాంటిది ఇలాంటి పెద్ద లోపాన్ని ఎలా వదిలేశారనేది విమర్శకులు ప్రశ్న.
ఐతే ఈ విమర్శ సర్కారు వారి టీం దగ్గరకి వెళ్ళింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసి వారి దగ్గర నుండి దీనిపై లాజికల్ సమాధానం వచ్చింది. మహేష్ మొదట ఇచ్చిన అప్పు 10వేల డాలర్లే. రెండోసారి ఇచ్చింది అప్పు కాదు. అప్పటికే కళావతి పాత్రని భార్యగా ఊహించేసుకుంటాడు. రెండోసారి ఇచ్చిన 15వేల డాలర్లు పర్శనల్ ఇంట్రస్ట్ తో ఇస్తాడు. అందుకే దాన్ని అప్పులో కలపలేదట.
సర్కారు టీం చెప్పిన ఈ లెక్క కూడా లాజికల్ గా వుంది. ఐతే ఇదే మాట ఒక డైలాగ్ లో చెప్పేసివుంటే ఈ కన్ఫ్యుజన్ వుండేది కాదు.