బ్యాంకు సెట్ సిద్ధం చేస్తున్న పరశురామ్ టీమ్

By Inkmantra - July 01, 2020 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 'సరిలేరు నీకెవ్వరు' ఘన విజయం సాధించడంతో ఫుల్ జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యే పరశురామ్ తో ప్రాజెక్టును ప్రకటించారు. 'సర్కారు వారి పాట' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. వేలకోట్ల స్కాములతో బ్యాంకులను ముంచి విదేశాలకు పరారయ్యే ఆర్ధిక నేరస్తుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. మహేష్ ఈ సినిమాలో అలాంటి నేరస్తుల ఆటకట్టించేందుకు నడుం బిగిస్తాడట.

 

ఈ మిషన్ ప్రారంభించేందుకు ఒక సంఘటన కారణం అవుతుందట. అందుకే ఈ సినిమాలో బ్యాంక్ లో జరిగే సన్నివేశాలు ఎక్కువే ఉంటాయట. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'సర్కారు వారి పాట' టీమ్ ఓ బ్యాంక్ సెట్ ను నిర్మించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. నిజానికి ఈ సెట్ నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టారని, రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ నిర్మాణం కొనసాగుతోందని అంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. మొదటి షెడ్యూల్ ఈ బ్యాంక్ సెట్ లో నే ప్లాట్ చేస్తున్నారట. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

 

థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS