శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తాను తీసిన తొలి సినిమానే జాతీయ అవార్డు వరించడంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు దర్శకుడు సతీష్ వేగేశ్న.
ఇక తన రెండవ ప్రయత్నం కూడా అదే బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం రూపంలో చేయడం అది ఇంకొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ తరుణంలో ఆయనకి నిర్మాత దిల్ రాజు మరో అవకాశాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది అని సమాచారం, ఒక వేళ ఇదే గనుక నిజమైతే దిల్ రాజు బ్యానర్ లో సతీష్ కి ముచ్చటగా మూడవసారి అవకాశం దొరికినట్టే అని చెప్పొచ్చు. మరి తాను తీసిన రెండు చిత్రాలు కుటుంబం, బంధాలు, పెళ్ళి నేపధ్యంతో కూడినవే అవ్వడంతో ఆయన తన మూడవ ప్రయత్నంగా ఏం చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆయన మూడవ చిత్రానికి మా తరపున బెస్ట్ విషెస్...