మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా. ఈ చిత్రానికి సంబందించిన తొలి షెడ్యూల్ ఈమధ్యనే పూర్తవ్వగా రెండవ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది అని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ తరుణంలో, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించాల్సి ఉండగా ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదు అని ఇవ్వన్ని కేవలం కల్పితాలు మాత్రమే అని తెలుస్తున్నది.
ఆయన పాత్ర చిత్రీకరణ సమయంలో ఆయన వస్తారు అని అయితే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ షూటింగ్ చివరిదశలో ఉండవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక అమితాబ్ తో పాటుగా ఈ చిత్రంలో నయనతార, సేతుపతి, జగపతిబాబు వంటి హేమాహేమీలు పనిచేస్తున్న సంగతి విదితమే. డేట్స్ సరిపోని కారణంగా రెహ్మాన్ ఒక్కరే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలిసింది.
ముందుగా ప్రకటించిన వారందరు ఈ చిత్ర షూటింగ్ లో భాగస్వాములు కానున్నారు.