`శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `రంగస్థలం` ఇలా హిట్లమీద హిట్లు, సూపర్ హిట్లు అందుకున్న సంస్థ మైత్రీ మూవీస్. ఇప్పుడు `సవ్యసాచి`తో తొలిసారి ఫ్లాప్ రుచి చవిచూసింది.
నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. తీరా చూస్తే... రూ.9 కోట్లే వచ్చాయి. ప్రతీచోటా బయ్యర్‌కి సగానికి సగం నష్టం. నైజాం 2.35 కోట్లు తెచ్చుకున్న సవ్యసాచి ఓవర్సీస్లో 1.25 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ కలసి రూ.7 కోట్లు తెచ్చుకోగలిగింది. శాటిలైట్, డిజిటల్ రూపంలో విడుదలకు ముందే.. రూ.12 కోట్ల వరకూ రాబట్టుకుంది.
సినిమాకి జరిగిన బిజినెస్‌తో.. మైత్రీ తేరుకోగలిగింది. అయితే అధిక బడ్జెట్, రీషూట్లు మైత్రీకి గుదిబండగా మారాయి. ఈనెల 16న మైత్రీ నుంచి `అమర్ అక్బర్ ఆంటోనీ` వస్తోంది. `సవ్యసాచి` వల్ల కలిగిన నష్టాల్ని రవితేజ సినిమా తగ్గిస్తుందా? లేదా పెంచుతుందా ? అనేది బాక్సాఫీసే తేల్చాలి.