'సవ్యసాచి'లో నవ్వుల 'వెన్నెల'.!

మరిన్ని వార్తలు

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోయే 'సవ్యసాచి' సినిమా ప్రమోషన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'గర్భస్థ కవలలు ఒక్కటి కావడం..' అంటూ మొదటి కాన్సెప్ట్‌ని విడుదల చేయడంతో సినిమా సీరియస్‌ మూవీ అని ప్రొజెక్ట్‌ అయ్యింది. అయితే ట్రైలర్‌ వచ్చాక, అందులో అంతా నిజం లేదని అర్ధమైంది. ప్రచార చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ కామెడీని హైలైట్‌ చేస్తూ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. 

వెన్నెల కిషోర్‌ కామెడీ టైమింగ్‌ని చాలా సినిమాల్లో చూసేశాం. అయితే చందూ మొండేటి ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌ని చాలా కొత్తగా డిజైన్‌ చేశాడట. నాగచైతన్య ఎడమచేయి సినిమాలో కీలకమన్న సంగతి తెలిసిందే. ఆ ఎడమచేయికీ, వెన్నెల కిషోర్‌కీ మధ్య జనరేట్‌ అయ్యే ఫన్‌ మామూలుగా ఉండదంట. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందేనంటున్నారు. విలన్‌గా నటిస్తున్న మాధవన్‌ పాత్రకూ, నాగచైతన్యకూ మధ్య వచ్చే సీరియస్‌ యాక్షన్‌ సీన్స్‌ని మించి వెన్నెల కిషోర్‌ - చైతూ మధ్య కామెడీ ఉండబోతోందట. 

ఇక కాన్సెప్ట్‌ పరంగా కొత్త ఇంట్రెస్ట్‌ అయితే క్రియేట్‌ అయ్యింది సినిమాపై. చైతూ నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం కాస్త అటూ ఇటూ అయినా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందించిన పాటల్లో కొత్తదనం, చైతూ డాన్సుల కోసం పడిన కష్టం అంతా ఆల్రెడీ ఫ్యాన్స్‌కి అర్ధమైపోయింది ప్రోమోస్‌ ద్వారా. ఇక హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ గ్లామర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యేలా ఉంది. 

చూడాలి మరి కొత్తదనంతో పాటు యాక్షన్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, లవ్‌, అండ్‌ గ్లామర్‌ అన్నీ పుష్కలంగా మిళితమై వస్తోన్న 'సవ్యసాచి' రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో చూడాలంటే మరి కొన్ని గంటలు మాత్రమే వెయిట్‌ చేయాలి. లెట్స్‌ వెయిట్‌ అండీ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS