అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న బాలయ్య బాబు..

మరిన్ని వార్తలు

అల్లూరి సీతారామరాజు అనగానే మనకి సినిమాల పరంగా గుర్తుకువచ్చే ఏకైక పేరు సూపర్ స్టార్ కృష్ణ. అట్లాంటిది పెద్ద ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర పైన ఉన్న మక్కువతో ఆయన చివరి సినిమాలో ఒక పాటలో కూడా అల్లూరి పాత్రలో మెరుస్తారు.

దీనికి ప్రధాన కారణం- అల్లూరి పాత్ర అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం. పలుమార్లు ఆయనతో సినిమా చేద్దాము అని మొదలుపెట్టి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేశారు. ఆయన వారించినా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సినిమా చేశాడు అని ఆయనతో కొన్నాళ్ళు మాట్లాడడం కూడా మానేశారు. తరువాత కాలంలో వారి మధ్య సయోధ్య నెలకొంది అనుకోండి. అది వేరే విషయం.

ఇక ఈ వార్త విషయానికి వస్తే, ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా ఆయన పోషిస్తున్న పలు పాత్రల్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కూడా కనిపించనున్నాడంట బాలయ్య. దీనికి సంబంధించిన షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగిందట.

ఇప్పటికే పలు ఆసక్తికర పాత్రల్లో బాలయ్య మనకు ఈ బయోపిక్ ద్వారా కనిపించనున్న తరుణంలో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS