టీజర్‌ టాక్‌: 'సవ్యసాచి' అంటే ఓ అద్భుతం.!

By iQlikMovies - October 01, 2018 - 12:13 PM IST

మరిన్ని వార్తలు

'మామూలుగా ఒకే తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అలా కాక ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని..' అంటున్నాడు నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'సవ్యసాచి' చిత్రంలోనిదీ డైలాగ్‌. 

తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్‌. విలక్షణ దర్శకుడు చండూమొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ హీరో మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీజర్‌లో మాధవన్‌ ఎంట్రీ ఆకట్టుకుంటోంది. అత్యంత క్రూరంగా ఆయన పాత్ర ఉండబోతోందని సింబాలిక్‌గా చూపెట్టారు. సీనియర్‌ నటి భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది ఈ సినిమాలో. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర విభిన్నంగా ఉండబోతోంది. 

ఆయన కుడిచేయి ఆయన మాట వినదట. ఆ విషయాన్ని టీజర్‌లో కూడా చూపించారు. ఏదో అద్భుతమైన శక్తి ఆ చేతికి ఉంటుంది. ఏదో తెలియని ఇంట్రెస్ట్‌ని ఈ టీజర్‌ ద్వారా క్రియేట్‌ చేశారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'సవ్యసాచి' చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ వారు రూపొందించారు. 

ఇటీవలే 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్య ఈ సారి 'సవ్యసాచి'తో ఏం అద్భుతం చేస్తాడో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS