స‌వ్య‌సాచి' మూడు రోజుల‌కు ఎంత‌?

By iQlikMovies - November 05, 2018 - 12:32 PM IST

మరిన్ని వార్తలు

శుక్ర‌వారం విడుద‌లై.. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది `స‌వ్య‌సాచి`. తొలిరోజు వ‌సూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్కాయి. టాక్ ఎలా ఉన్నా ఈ వీకెండ్ `స‌వ్య‌సాచి`కి క‌లిసొస్తుంద‌నుకున్నారంతా. 

కానీ.. ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. తొలి మూడు రోజుల‌కు గానూ.. 8 కోట్ల షేర్ మాత్ర‌మే సంపాదించుకోగ‌లిగింది. శుక్ర‌వారం కంటే శ‌నివారం, శ‌నివారం కంటే ఆదివారం వ‌సూళ్లు డ‌ల్‌గా ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నైజాంలో 2.15 కోట్లు, సీడెడ్‌లో 1.10 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో 1.05 కోట్లు తెచ్చుకుంది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా భారీ న‌ష్టాలు చ‌విచూసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

 

దాదాపుగా 22 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మేశారు. మూడు రోజుల‌కు 10 కోట్లు కూడా తెచ్చుకోలేదు. అంటే... దాదాపు స‌గం న‌ష్టాల్ని బ‌య్య‌ర్లు భ‌రించాల‌న్న‌మాట‌. ఈ దీపావ‌ళికి తెలుగు నుంచి మంచి సినిమాలేం లేవు. `స‌ర్కార్‌` ఒక్క‌టే కాస్త గ‌ట్టిపోటీ ఇవ్వ‌గ‌ల‌దు. 

దీపావ‌ళి సెల‌వుని `స‌వ్య‌సాచి` క్యాష్ చేసుకోగ‌లిగితే... న‌ష్టాలు కాస్త త‌గ్గుతాయి. మ‌రి ఏం అవుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS