మెగా హీరోతో నిథి...?

By iQlikMovies - November 05, 2018 - 12:12 PM IST

మరిన్ని వార్తలు

`స‌వ్య‌సాచి`తో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది నిథి అగ‌ర్వాల్‌. ఆ సినిమా ఫ్లాప్ అయినా... నిధికి కొత్త అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థే ఆమెకు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చింది.  

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. బుచ్చిరాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నిధి అర‌గ్వాల్‌ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. 

`స‌వ్య‌సాచి` కోసం ఎగ్రిమెంట్ చేస్తున్న్ప‌పుడే మైత్రీ మూవీస్ ఆమెకు మ‌రో సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా చేతిలో పెట్టేసింద‌ట‌. ఇప్పుడు ఆ కాల్షీట్లు ఇలా వాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `మిస్ట‌ర్ మ‌జ్ను`లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది నిధి. 

ఇది తెలుగులో ఆమెకు ముచ్చ‌టగా మూడో సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS