'సవ్యసాచి'లో మాధవన్‌ తుఫాన్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

'ప్రేమ కోపం లాంటి ఎమోషన్స్‌ మీకొస్తే మీరు మాత్రమే రియాక్ట్‌ అవుతారు. అదే నాకొస్తే, నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్‌ అవుతాడు. అది నా ఎడమచేయి..' అంటున్నాడు నాగచైతన్య. చైతూ నటిస్తున్న తాజా చిత్రం 'సవ్యసాచి'లోనిదీ డైలాగ్‌. తాజాగా ట్రైలర్‌ వచ్చింది. ట్రైలర్‌ కాదు, మాధవన్‌ మాటల్లో చెప్పాలంటే 'తుఫాన్‌' వచ్చేసింది. ఏంటా తుఫాన్‌.? ఎందుకొచ్చిందా తుఫాన్‌.? తెలియాలంటే మాత్రం సినిమా చూడాలి. తుఫాన్‌ మాత్రం వసూళ్ల బీభత్సం సృష్టించేలానే ఉంది. 

నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సినిమా అనిపించుకునే లక్షణాలు ట్రైలర్‌లోనూ కనిపిస్తున్నాయి. 'అనగనగా ఓ కుర్రోడు.. అందరిలాగే అతనికి రెండు చేతులు.. కుడిచేయి బాగానే ఉంటుంది. ఎడమ చేత్తోనే సమస్య. అతనికి సంబంధం లేకుండా ఆ చేయి ఏదేదో చేసేస్తుంటుంది. ఆ చేత్తోనే సమస్యలన్నీ.. కానీ ప్రాణం మీదికొస్తే, ఆ చెయ్యే అతనికి బలం..' విలన్‌ సృష్టించే తుఫాన్‌కి ఆ మామూలు కుర్రోడి అసాధారణ ఎడమచేయి ఎలా సమాధానమిచ్చిందో తెలియాలంటే సినిమా చూడాలి. 

యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. కొంచెం ఫన్‌ కూడా ఉంది. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ అందంగా కనిపించింది.. వెరసి ఇదొక కంప్లీట్‌ ప్యాకేజ్‌. అదీ కమర్షియల్‌ ప్యాకేజ్‌. 'సవ్యసాచి'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగచైతన్య. పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడు కాదు, ఆ పద్మవ్యూహాన్ని చేధించే సత్తా ఉన్న అర్జునుడు ఈ 'సవ్యసాచి'.!

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS