కత్రినా కైఫ్ నటిస్తున్న తాజా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందోస్థాన్'. ఈ సినిమా ప్రచార చిత్రాలు అందరిలోనూ ప్రత్యేకమైన ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. హాలీవుడ్ మూవీ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్స్' తరహాలో విజువల్స్ కనిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని 'సురయ్యా..' సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, కత్రినా కైఫ్. కత్రినా అందచందాల సంగతి తెలిసిందే. మరి డాన్సులో, అవి కూడా తెలియని వారుంటారా.? కానీ ఈ సాంగ్‌లో కత్రినా కైఫ్ డాన్స్ చూసి అవాక్కయిపోతున్నారు అభిమానులు. అబ్బా.! ఆ నడుం తిప్పుడేంటీ.? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు నడుమెక్కడుందీ అని వెతుక్కోవాల్సి వస్తోంది. అలా బొంగరంలా తన అందమైన నడుమును గిరగిరా తిప్పేస్తోంది కత్రినా కైఫ్.
తెలుగులో 'మల్లీశ్వరి' సినిమాలో నటించినప్పుడు కత్రినాకైఫ్ డాన్సులకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ అది గతం. బాలీవుడ్‌కెళ్లాక కత్రినా పూర్తిగా మారిపోయింది. యాక్టింగ్, డాన్సులు.. ఇలా అన్నింట్లోనూ ఊహించని మేకోవర్‌తో అక్కడ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది.
ఇక తాజా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందోస్థాన్'లో కత్రినా నటనకు అంతా ఫిదా అవ్వాల్సిందేనట. కళ్లు చెదిరే విజువల్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి' తరహా గెటప్స్ ఇలా ఈ సినిమాలో ప్రతీదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.