'అఖిల్' సినిమాతో భారీ ఆశలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ సయేషా సైగల్. అంచనాలు భారీగా అయితే ఉన్నాయి కానీ, సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. దాంతో సయేషా కెరీర్‌కి ఇది గట్టి దెబ్బగా మిగిలిపోయింది. తొలి సినిమా డిజాస్టర్ టాక్‌తో తెలుగులో మరో అవకాశమే రాకుండా పోయింది సయేషాకి. ఇక ఇక్కడ వర్కవుట్ కాదులే అని తమిళంలో అదృష్టం పరీక్షించుకుంది.
అక్కడ అదృష్టం బాగానే కలిసొచ్చింది. వరుసగా మంచి సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది. కొన్ని సక్సెస్‌లూ దక్కించుకుంటోంది. తాజాగా కన్నడ పరిశ్రమపైనా సయేషా కన్నేసింది. కన్నడ ప్రముఖ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన ఛాన్స్ దక్కించుకుంది. సంతోష్ దర్శకత్వంలో పునీత్ నటిస్తున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో సాయేషా హీరోయిన్‌గా ఎంపికైంది. సంతోష్ - పునీత్ కాంబోలో గతంలో 'రాజకుమార' సూపర్ హిట్ వచ్చింది.
అప్పుడప్పుడూ తెలుగులో కూడా పునీత్ సినిమాలు అనువాదమై మంచి పేరు దక్కించుకుంటాయి. సాయేషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సో ఈ కాంబినేషన్‌లో మూవీ అంటే తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. లవర్స్‌డే సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తమిళ తంబీలు అక్కున చేర్చుకున్నట్లే, కన్నడిగులు కూడా సాయేషాను ఆదరిస్తారేమో చూడాలిక.