'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ పెద్ద చేపకే గాలమేసిందండోయ్. పరిచయమైన తొలి రెండు సినిమాలు అమ్మడికి నిరాశే మిగిల్చాయి. కానీ ఏదో మ్యాజిక్ ఉంది ఈ ముద్దుగుమ్మలో. కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా కూసింత ఎక్కువే. ఫస్ట్ మూవీ సవ్యసాచి ఫెయిల్యూర్ ఓకే కానీ, 'మిస్టర్ మజ్ను' ఫెయిల్యూర్ కాదని వాదించింది. ఇక ముచ్చటగా మూడో సినిమాగా 'ఇస్మార్ట్ శంకర్'లో ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా తన మనసులోని మాట బయటపెట్టింది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో డాన్స్ చేయాలని ఉందంటోంది. డాన్స్ అంటే తనకు ప్రాణమనీ, అందులోనూ అల్లు అర్జున్ డాన్సులంటే ఇంకా ఇష్టమనీ ఆయన డాన్సుల కోసమే బన్నీ నటించిన కొన్ని తెలుగు సినిమాలు చూశానని చెప్పింది. అల్లు అర్జున్‌తో డాన్స్ చేయాలనుందని కూడా ఓపెన్‌గా అడిగేసింది. అంటే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా నటించేయాలని కలలు కనేస్తోంది.
తప్పేముంది. ఏమో జరిగినా జరగొచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీకి ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. కైరా అద్వానీ, రష్మికా మండన్నా పేర్లు పరిశీలనలో ఉన్నాయంతే. నిధి ఇంతగా ఆడిగేస్తోంది కనుక ఒకవేళ అమ్మడి కోరిక మన్నించి, అల్లు అర్జున్ నిధి అగర్వాల్‌కి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి.