'అఖిల్' సినిమాతో అక్కినేని అఖిల్‌కి జోడీగా నటించింది ముద్దుగుమ్మ సాయేషా సైగల్. యాక్టింగ్‌లోనూ టాలెంట్ ప్రదర్శించింది. డాన్సులు అయితే ఇరగదీసేసింది. అఖిల్‌తో సమానంగా డాన్సులేసింది. తొలి సినిమాతో తనవరకూ తాను ఇన్స్పైర్ చేసింది హీరోయిన్గా. కానీ సినిమా ఫెయిల్యూర్ కావడంతో అమ్మడికి తగిన గుర్తింపు దక్కలేదు. మరో ఛాన్స్ కూడా ఇవ్వలేదు టాలీవుడ్ ఈ క్యూట్ బ్యూటీకి.
మరో ఛాన్స్ ఇచ్చుంటే తానేంటో ప్రూవ్ చేసుకునేది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో 'శివాయ్' సినిమాలో నటించింది. స్టార హీరో అజయ్ దేవగణ్‌తో జత కట్టింది ఈ సినిమాలో. అక్కడ కూడా నిరాశే మిగిలింది ఈ బ్యూటీకి. దాంతో అట్నించి కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన 'వనమగన్' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో అమ్మడు ఫర్వాలేదనిపించింది. అమ్మడి డాన్సింగ్ టాలెంట్ చూసి ప్రభుదేవా ఈ సినిమాలో సాయేషాతో ఓ పాటకి డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాటతో అమ్మడు బాగా రిజిస్టర్ అయిపోయింది.
బీచ్ ఒడ్డున అందాలారబోస్తూ వేసిన స్టెప్పులు ఆహా అదరగొట్టేసింది. ప్రస్తుతం కార్తీతో ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా తమిళంలోనే మరో సినిమాకీ సైన్ చేసింది ఈ బ్యూటీ. అదే 'గజనీకాంత్'. ఈ సినిమా తమిళంలో ముచ్చటగా మూడో సినిమా సాయేషాకి. లేటెస్టుగా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అలా టాలీవుడ్, బాలీవుడ్ ఆదరించకపోయినా, అమ్మడి టాలెంట్‌ని కోలీవుడ్ గుర్తించింది. అక్కడ కెరీర్ ఫాస్ట్‌గానే నడుస్తోంది సాయేషాకి. తాజా సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్.పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.