ముద్దుగుమ్మ సమేషాలో టాలెంట్ చాలా ఎక్కువే. కానీ అదృష్టమే ముద్దుగుమ్మ తలుపు తట్టడం లేదు. ఒక్క ఛాన్స్.. ఇంకొక్క ఛాన్స్ అంటోంది. తెలుగులో తొలి సినిమా 'అఖిల్' నిరాశ పరచడంతో టాలీవుడ్ అమ్మడిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక బాలీవుడ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. సీనియర్ నటుడు అజయ్ దేవగణ్‌తో నటించే ఛాన్స్ కెరీర్ తొలి నాళ్లలోనే దక్కించుకున్నా అది కూడా వర్కవుట్ కాలేదు. లేటెస్టుగా తమిళంలో నటించిన 'వనమగన్' సినిమా కూడా బెడిసికొట్టడంతో అమ్మడు పాపం ఖాళీ అయిపోయింది. ఈ సినిమాలో సాయేషా చేసిన డాన్సు స్టెప్పులకి ఆహా ఓహో అన్నారు కానీ, సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమె టాలెంట్ వృధా అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పుడూ ఫాస్ట్‌గానే ఉంటుంది. హాట్ హాట్ పోజులతో కుర్రకారుకు నేనున్నానంటూ గుర్తు చేస్తూనే ఉంటుంది.