'అఖిల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ సాయేషా సైగల్. డాన్సుల్లోనూ, యాక్టింగ్‌లోనూ మంచి మార్కులేయించుకుంది కానీ, సినిమా డిజాస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మని టాలీవుడ్‌లో ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ తర్వాత. అయినా తెలుగు సినిమాల్లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉందీ ముద్దుగుమ్మ. ఈ తరుణంలోనే కోలీవుడ్ ఆమెకి పిలిచి మరీ అవకాశాలిచ్చింది.
అందులో భాగంగానే తాజాగా సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో మల్టీస్టారర్‌కి సూర్య కమిట్ అయ్యాడు. అదే కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో కీలకపాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో, మన అల్లు వారబ్బాయ్ శిరీష్ నటిస్తున్నాడు. ఈ సినిమాకే హీరోయిన్‌గా సాయేషా సైగల్‌ని ఎంచుకున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారమ్.
కాగా ఆల్రెడీ సాయేషా తమిళంలో కార్తీతో ఓ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు, తమిళ యంగ్ హీరోస్ ఆర్య, విజయ్‌సేతుపతిలతోనూ రెండు చిత్రాల్లో నటిస్తోంది. సో ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి ఆఫర్లు రాకపోయినా, కోలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో దున్నేస్తోంది. అందుకే అక్కడ ప్రస్తుతం అఖిల్ బ్యూటీ సో బిజీ అండీ బాబూ.!