సావిత్రి బయోపిక్‌లో నటించిన కీర్తి సురేష్‌కి దక్కిన సక్సెస్, కీర్తి, ప్రతిష్టలతో బయోపిక్స్ అంటూ ముందుగా కీర్తిసురేష్ పేరును పరిశీలించడం మామూలే. ఆ కోణంలోనే జయలలిత బయోపిక్‌లో కూడా కీర్తి సురేష్ నటించబోతోందంటూ గాసిప్ బాగా స్ప్రెడ్ అవుతోంది.
'మహానటి' సినిమా విడుదలయ్యాక, అలనాటి మేటి నటి సావిత్రి పాత్రలో ఆమె చూపించిన టాలెంట్‌కి, జయలలిత పాత్రకు కూడా కీర్తినే కరెక్ట్ ఎంపిక అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈ వార్తలో ఎంత మాత్రమూ నిజమయితే లేదు. డైరెక్ట్‌గా కీర్తి సురేషే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఇంతవరకూ జయలలిత బయోపిక్ విషయమై తననెవరూ సంప్రదించలేదనీ, ఆ బయోపిక్‌లో తాను నటించడం లేదనీ, తాజాగా ట్విట్టర్‌లో స్పందించింది కీర్తి సురేష్.
జయలలిత మరణానంతరం, సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆమె బయోపిక్‌ని తెరకెక్కిస్తానంటూ దానికి 'శశి లలిత' అనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్‌మెంట్ చేసిన చాలా ప్రాజెక్టులు కార్య రూపం దాల్చలేదన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఈ జయలలిత బయోపిక్ అన్న మాట. అయితే 'మహానటి' బయోపిక్ వచ్చాక, ఇప్పుడు జయలలిత బయోపిక్ వెలుగులోకి వచ్చింది.
అసలింతకీ ఈ సినిమాని తెరకెక్కించాల్సిన వర్మగారే ఈ గాసిప్‌పై స్పందించలేదు. ఇప్పటికే ఆయన ఖాతాలో తెరకెక్కడానికి 'ఎన్టీఆర్' బయోపిక్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌కే తలా, తోకా లేదు. ఇంకెప్పుడు జయలలిత ప్రాజెక్ట్‌ని వర్మ ఎత్తుకోవాలి. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన నాగార్జున 'ఆఫీసర్' ఇంకా ధియేటర్స్‌లో సందడి చేయడం లేదు. ఈ నెల 25 రావాల్సిన ఈ సినిమా జూన్ 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.