బాలీవుడ్ భామ సయ్యేషా సైగల్, తమిళ హీరో ఆర్యని పెళ్ళాడిన విషయం విదితమే. తెలుగులో ఈ భామ ఒకే ఒక్క సినిమా చేసింది. అదీ అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అఖిల్’ సినిమాలో. ఇటు సయ్యేషాకీ, అటు అఖిల్‌కీ ఇది తొలి సినిమా కావడం గమనార్హం. సినిమా ఫలితం తేడా కొట్టేసినా, ‘అఖిల్’ తన కెరీర్‌లో వెరీ స్పెషల్ ఫిలిం అని ఇప్పటికీ చెబుతుంటుంది సయ్యేషా. అసలు విషయానికొస్తే, ఈ బ్యూటీ మంచి డాన్సర్. తాజాగా ఓ డాన్స్ మూమెంట్‌తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. కరోనా వైరస్‌ని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయిపోయారు. సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే ఎలా.? అందుకే, సరికొత్త ఛాలెంజ్‌లు తెరపైకి తెస్తున్నారు. ‘జెలోసూపర్‌బౌల్ ఛాలెంజ్’ పేరుతో సరికొత్త ఛాలెంజ్ సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియాలో. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన సయ్యేషా సైగల్ అద్భుతమైన డాన్స్ మూమెంట్‌తో అదరగొట్టేసింది. ఆ నడుము తిప్పుడు చూస్తే ఈ భామకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ‘లాక్ డౌన్ యాక్టివిటీస్’ పేరుతో సెలబ్రిటీస్ ఈ తరహా వీడియోలతో అభిమానులకి ఓ రేంజ్‌లో కిక్ ఇస్తున్నారు.